Wednesday, December 16, 2009

భీష్మ ఏకాదశి వార్షికోత్సవ ఆహ్వాన పావన పత్రిక

ఓం శ్రీహరల్లా శ్రీమన్నారాయణ యెహోవా పరమపిత సర్వకేంద్రాయ నమ:

భీష్మ ఏకాదశి వార్షికోత్సవ ఆహ్వాన పావన పత్రిక
(26-01-2010 - మంగళవారం)

ఓం శ్రీ వేదపూజ్య నేతిహరి హంస కాళీ బాబా చిన్మయ చైతన్య సర్వకేంద్ర స్వామి పరాత్పరమ అత్యాశ్రమ ప్రశాంతి నిలయం త్రిపురారం

ది.26-01-2010 (మంగళవారం) నాటి కార్యక్రమాల వివరాలు:

ఉదయం 9.00 గంటలకు శ్రీ యన్. హరిప్రసాద్, హైదరాబాద్ గారి నేతృత్వములో, ఆశ్రమ ప్రధాన ఆర్ధిక కార్యదర్శి శ్రీ బోనగిరి జానయ్యగారి ఆధ్వర్యములో లోక కళ్యాణదాయకమైన శాంతి యజ్ఞము నిర్వహించబడును. యజ్ఞములో పాల్గొనదలంచిన భక్తులు తమ పేర్లను ముందుగ శ్రీ జానయ్య గారివద్ద నమోదు చేయించుకొనవలయును.

ఊదయం 11.00 గంటలకు శ్రీవారి పవిత్ర ప్రధాన పాదజ్యోతి శ్రీ నేతి విజయదేవ్ ఆధ్వర్యములో బాబా సర్వకేంద్రుల సర్వ శరణ్య పూజ నిర్వహించబడును. ఈ పవిత్ర పూజా సమయములో బాబా పాదార్చకులు, త్రిపురారం గ్రామ వాస్తవ్యులైన శ్రీమతి చంచల మంగమ్మ, శ్రీ రాంబాబు పుణ్య దంపతులు నూతన వస్త్రములను సమర్పించుకొందురు.

26-01-2006 నాటి రాత్రి జ్ఞాన నేత్ర జాగరణ భజన కార్యక్రమములు, ఆశ్రమ సత్సంగ నిర్వహణ కార్యదర్శులైన పురోహిత శ్రీ అబ్బిమళ్ళ నరసిం హులుగారి ఆధ్వర్యములో నిర్వహించబడును. మహా శివరాత్రి రోజున సైతం అంతే.
ప్రతి సంవత్సర అన్నపూజ ద్రవ్యదాతలైన శ్రీమతి కుబ్బిరెడ్డి జ్యోతి, శ్రీ శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ వాస్తవ్యులైన పుణ్య దంపతులు ఈ సంవత్సరములో దివంగత కీర్తిశేషురాలైన శ్రీమతి కుబ్బిరెడ్డి సత్యమ్మ గారి ఆత్మశాంతిని కోరుచు ఆ జనని స్మారకార్ధము ఆమె ఏకైక సుపుత్రుడు శ్రీ కుబ్బిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పుణ్య దంపతులు ఘనముగ జరిపించుచున్నారు.

ఏ కుల, మత, ప్రాంతీయ పక్షపాతము లేదు. అందరూ ఆహ్వానితులే. దర్శించి తరించండి.

ముఖ్య సూచన:- ఆశ్రమ సంబంధ సమస్త కార్యములు బాబా సర్వకేంద్రుల అత్యాశ్రమ దత్త జ్యోతులైన శ్రీ నేతి విజయదేవ్, శ్రీమతి అరుణమ్మ గారల నేతృత్వ పర్యవేక్షణలో వుండును.

సంపూర్ణ దైవ చిత్తము సదా సర్వత్ర నెరవేరు గాక. సంపూర్ణ దైవ మతము సదా సర్వత్ర వర్ధిల్లు గాక. ఆమేన్. జై బాబా.

ఓం సర్వేత్ర సుఖినస్సంతు
సర్వేజనా సుఖినోభవంతు
లోకా స్సమస్తా సుఖినోభవంతు
ఓం శాంతి! శాంతి!! శాంతి:!!!

ఇట్లు
అత్యాశ్రమ ప్రధాన కార్యదర్శి,
నగిరి వెంకన్న, త్రిపురారం.

అత్యాశ్రమ ఉపకార్యదర్శి
నగిరి బిక్షమయ్య, త్రిపురారం.


అత్యాశ్రమ అధ్యక్షులు,
బాబా భాసరత్న శ్రీమదచల రాజయోగి,సద్గురుమూర్తి,
శ్రీ పందిరి శ్రీరాములు గారు,మిర్యాలగూడెం.

అత్యాశ్రమ ఉపాధ్యక్షులు,
శ్రీ ఆదూరి సుధాకర్ రెడ్డి గారు,
మెహిదీపట్నం, హైదరాబాద్.

అత్యాశ్రమ ప్రధాన ఆర్ధిక కార్యదర్శి,
శ్రీ బోనగిరి జానయ్య గారు, త్రిపురారం.

అత్యాశ్రమ ఆర్ధిక ఉపకార్యదర్శి,
శ్రీ కుబ్బిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిగారు,హైదరాబాద్.

అత్యాశ్రమ సత్సంగ నిర్వహణ కార్యదర్శి,
అబ్బిమళ్ళ నరసిం హులు గారు, త్రిపురారం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home