Monday, December 22, 2008

ఆహ్వాన శుభ పత్రిక

ఓం శ్రీ భగవతి నారాయణి పరమపిత సర్వకేంద్రాయ నమ:


ఆహ్వాన శుభ పత్రిక (05-02-2009 భీష్మ ఏకాదశి)

సంపూర్ణ దైవమత బోధక పరాత్పరమ అత్యాశ్రమ ప్రశాంతి నిలయం
త్రిపురారం (మండలం),నల్లగొండ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.

ఇందుమూలముగా సమస్త భక్త మహాశయులకు తెలియపరచు ముఖ్య విషయము ఏమనగా ది.05-02-2009 (గురువారం) భీష్మ ఏకాదశి పర్వ దినమున బాబా సర్వకేంద్రులవారి అత్యాశ్రమ వార్షికోత్సవ సందర్భములో ఈ దిగువ సూచిత కార్యక్రమములు నిర్వహించబడును. అందులకై ఆసక్తిగల భక్తులు పాల్గొని, నేత్రపర్వ ఆత్మానంద భరితులై జన్మ చరితార్ధులు కండి.

1. 05-02-2009 గురువారం ఉదయం గం.8.00 లకు త్రిపురారం గ్రామ వాస్తవ్యులైన శ్రీమాన్ శ్రీ జీడికంటి లక్ష్మి నరసిం హాచార్యులు గారి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక సంబంధమైన విశ్వశాంతి యజ్ఞము నిర్వహించబడును.

2. ఈనాటి అన్న పూజా నిర్వహణ పుణ్య దంపతులు, ప్రతి సంవత్సర అన్న పూజ ద్రవ్య దాతలు - హైదరాబాద్,వనస్థలిపురం వాస్తవ్యులు శ్రీమతి కుబ్బిరెడ్డి జ్యోతి, శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారలు.

3. స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ – హైదరాబాద్, సైదాబాద్ వాస్తవ్యులు శ్రీమతి జె. శ్యామల, శ్రీ నారాయణ (బొంగు మర్చంట్) పుణ్య దంపతులు.

4. శ్రీ డేగల రామయ్య, బొల్లెద్దు సాయిలు గారల ఆధ్వర్యంలో కొమ్మాల భక్త, భజన బృందం వారు పాల్గొనగలరు.

5. బస్వోజు బ్రహ్మయ్యగారి ఆధ్వర్యంలో ఇండ్లూరు భక్త బృందంవారి బుర్రకథ కాలక్షేపం.

6. శ్రీ యం. లింగం, శ్రీ బి. రాం రెడ్డి గారల ఆధ్వర్యంలో మెదక్ జిల్లా, రాంపూర్ గ్రామ భక్తులు హాజరు కాగలరు.

05-02-2009 రాత్రి జ్ఞాన నేత్ర జాగరణ, భజన, సత్సంగములు ఉండును. సమయాను కూలముగ మధ్య మధ్య ఓం శ్రీ వేదపూజ్య నేతి హరి కాళీ బాబా చిన్మయ చైతన్య సర్వకేంద్ర స్వామివారి స్వహస్త లిఖిత అతీత దివ్య భాష్య ప్రవచనామృత ప్రసాదమును శ్రీవారి పవిత్ర ప్రధాన పాద జ్యోతి శ్రీ యన్. విజయ దేవ్ పంచగలరు.

మానవ జన్మ తరుణోపాయమునకు అమూల్య అవకాశము. ముందుగా తలుసుకోండి, పిదప తెలుసుకోండి, ఆపై కలుసుకోండి. శుభం. జై బాబా!

మరియొక ముఖ్య గమనిక:- ది.23-02-2009 (సోమవారం) మహా శివరాత్రి జాగరణ కార్యక్రమం ఆశ్రమ ఉద్ధారక కార్యకర్తలైన శ్రీ బోనగిరి జానయ్య, అప్పిమళ్ళ నర్సిం హులు, త్రిపురారం గ్రామ వాస్తవ్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడును. ఈ కార్యక్రమమునకు ఆశ్రమ దత్త పుత్రిక శ్రీమతి యం. అరుణ, శ్రీ యన్. విజయ దేవ్ పాల్గొనగలరు.


ఆశ్రమ అధ్యక్షులు, ఇట్లు,
శ్రీ పందిరి శ్రీరాములుగారు ఆశ్రమ ప్రధాన కార్యదర్శి,
(సద్గురుమూర్తి),మిర్యాలగూడెం. నగిరి వెంకన్న, త్రిపురారం.

ఆశ్రమ ఉపాధ్యక్షులు, ఆశ్రమ ఉపకార్యదర్శి,
శ్రీ ఎ.మల్లారెడ్డిగారు,(మాజీ సర్పంచ్),త్రిపురారం. నగిరి బిక్షమయ్య,త్రిపురారం.


లోకా సమస్తా సుఖినోభవంతు!
శాంతి! శాంతి!! శాంతి:!!!